హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేడ్కర్ విగ్రహం వద్ద చర్చకు రా: రాజయ్య

JN: స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. జనగామ జిల్లా, రెవెన్యూ డివిజన్‌, పాలిటెక్నిక్‌, మహిళా డిగ్రీ కళాశాలలు కేసీఆర్‌ హయాంలోనే వచ్చాయని పేర్కొన్నారు.