KRNL: ఆదోని తిరుమలనగర్‌కు చెందిన ఎరుకల వెంకటేశ్వర్లు ఏపీ ఎరుకల సేవా సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ ఛైర్మన్ పాలపర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో ఎన్నిక జరిగినట్లు తెలిపారు. ఎరుకల సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేస్తానని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సంఘం కమిటీని సమన్వయం చేస్తూ పనిచేస్తానని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎరుకల సేవా సంఘం కమిటీ ఎన్నిక


