NDL: ప్యాపిలిలోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయపైకప్పు మంగళవారం కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పైకప్పు కూలడం ఇది రెండోసారి కావడంతో పూజారులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆలయం శిథిలావస్థకు చేరిందని భక్తులు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూలిన చెన్నకేశవ ఆలయ పైకప్పు


