PLD: రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరు ఆంధ్రా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బొడ్డు నవీన్ కుమార్ (మణి మెడికల్స్)ను బుధవారం ఉదయం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాద బాధితున్ని పరామర్శించిన ఎమ్మెల్యే


