W.G: పోలవరం జిల్లా చింతూరు సోకులేరు వాగులో గల్లంతైన భీమవరం యువకుడు బుంగ బాలవందన్ (18) మృతదేహం లభ్యమైందని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. బంధువులతో విహారయాత్రకు వెళ్లిన బాలవందన్.. కొట్టుకుపోతున్న మరో వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వాగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం


