VZM: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. ఎం వెంకటాపురం గ్రామంలో పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. మంచినీరు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భరత్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు తప్పనిసరి'


