ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో పదవీకాలం ముగిసిన ఎంపీపీ, మండల ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులకు ఇవాళ ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రసాదరావు తెలిపారు. పదవీకాలంలో మండల అభివృద్ధికి వారు అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొయ్యూరులో ఆత్మీయ సత్కార కార్యక్రమం


