హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా జిల్లా యువజన పోటీలు

E.G: దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని రాజానగరం GGU ప్రో వీసీ డాక్టర్ కేవీబీ రాజు అన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వర్సిటీలో మంగళవారం జిల్లా స్థాయి పోటీలు మంగళవారం జరిగాయి. 15-29 ఏళ్ల వయసున్న 435 మంది నృత్యం, నాటకం, కవిత్వం, పెయింటింగ్ విభాగాల్లో పోటీపడ్డారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని సెటైజ్ సీఈవో విశ్వేశ్వరరావు తెలిపారు.