హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు టోకెన్ల జారీ నిలుపుదల

TPT: తిరుమల శ్రీవారి సర్వదర్శనం (SSD) టైం స్లాట్ టోకెన్ల జారీని బుధవారం నిలుపుదల చేశారు. శుక్రవారం నాటి శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను గురువారం ఉదయం నుంచి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కౌంటర్లలో యథావిధిగా జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, తమ తిరుమల ప్రయాణాన్ని, దర్శన సమయాన్ని ప్రణాళిక చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.