NDL: సంజామల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ‘దసరా ధమాకా ఆఫర్’ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సాల్మన్ తెలిపారు. ప్రజలు 10 కిలోల డ్రై వేస్ట్(ప్లాస్టిక్ వ్యర్థాలు) పంచాయతీకి అందజేస్తే టోకెన్ ఇస్తామని, దసరా రోజున లాటరీ ద్వారా 6 టోకెన్లను ఎంపిక చేసి ఇంటి అవసరాల సరుకులను బహుమతులుగా అందిస్తామన్నారు. ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర’లో భాగస్వాములు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్లాస్టిక్ వ్యర్థాలకు బహుమతులు: ఎంపీడీవో


