హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జన్నారం బంద్‌కు పిలుపు

మంచిర్యాల: టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం బందుకు పిలుపునిస్తున్నామని సామాజిక పోరాట సమితి జన్నారం మండల కన్వీనర్ భూమాచారి తెలిపారు. 39 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టైగర్ జోన్, ఎకో జోన్‌తో అభివృద్ధి ఆగిపోయిందని, నేటి బందుకు అందరు సహకరించాలని ఆయన కోరారు.