WGL: నర్సంపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలో రిటైల్, రెస్టారెంట్ బార్ నిర్వహణకు ఫారం-2బీ లైసెన్సుల జారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ జయశ్రీ తెలిపారు. అర్హులు రూ.లక్ష డీడీతో అక్టోబర్ 12లోగా వరంగల్ డీఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. లాటరీ అక్టోబర్ 16న నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
బార్ లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం


