హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

BHPL: చిట్యాల మండలం చల్లగరిగ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఆటో బోల్తాపడి ముగ్గురికి గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి చిట్యాల వస్తుండగా ప్రమాదం జరిగింది. సురేందర్‌కు కాలు విరగగా, రాధమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మొగిలికి చేతికి తీవ్ర గాయమైంది. 108 సిబ్బంది క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.