హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 8న ఐటీడీఏ పాలకవర్గ సమీక్ష

పార్వతీపురం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాలకవర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. సుమారు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా అక్టోబర్ 8న సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పెండింగ్‌ సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించనున్నట్లు ఐటీడీఏ వర్గాలు వెల్లడించాయి. అధికారులు సంబంధిత అంశాలపై నివేదికలను సిద్ధం చేస్తున్నారు.