హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్

GDWL: గద్వాల మున్సిపల్ షాపుల అద్దెల వసూళ్లలో రూ.11.28 లక్షలు ఖాతాలో జమ చేయకుండా పక్కదారి పట్టినట్లు తేలింది. దీనిపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ ఆఫీసర్ రాజేశ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ రాజవర్ధన్, జూనియర్ అసిస్టెంట్ రాజవర్ధన్నాయుడులను సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.