GNTR: ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామంలో మంగళవారం రాత్రి ‘సంకల్పం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిరంగిపురం సీఐ కె. భుజంగరావు సిబ్బందితో కలిసి గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కల్పించారు. మహిళలపై జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వేములూరుపాడులో సంకల్పం కార్యక్రమం


