హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపూడి వద్ద రోడ్డు ప్రమాదం

GNTR: ఫిరంగిపురం మండలంలోని రేపూడి కోల్డ్‌స్టోరేజీ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నిలిపి ఉంచిన ట్రిప్పర్‌ లారీను వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తలకు తీవ్ర రక్తగాయమైంది. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.