హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరటితోటలో గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్..!

KDP: అరటితోటలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. కోమన్నూతల గ్రామానికి చెందిన నడిపి వెంగముని అరటితోటలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు వెల్లడించారు. గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.