హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయిల్ ట్యాంకర్ ఢీకొని పాస్టర్ మృతి

HNK: ఎల్కతుర్తి మండలం ఎల్లాపురం బ్రిడ్జి వద్ద ఆయిల్ ట్యాంకర్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో పాస్టర్ సందెల మాణిక్యం (75) మృతి చెందారు. ఎల్కతుర్తి చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్న మాణిక్యం మంగళవారం బైక్‌పై హనుమకొండకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.