హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల వేళ హత్య కేసును తెరపైకి తెస్తున్నారు'

అన్నమయ్య: వివేకానంద రెడ్డి హత్య కేసును ఎన్నికల సమయంలో రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా జగన్‌, వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేకే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేసు ట్రయల్‌ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని అన్నారు.