VSP: పరవాడ మండలంలో బుధవారం ఉదయం 9 గంటలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పర్యటించనున్నారని మండల జనసేన అధ్యక్షుడు బొద్దపు శ్రీనివాసరావు తెలిపారు. అసకపల్లి, పెదముషిడివాడ, లంకెలపాలెం, పరవాడ మీదుగా ఊటగెడ్డ కూడలి వరకు రహదారిని పరిశీలిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


