MDK: రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో ముస్లాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని పూజశ్రీ ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఇంధన వనరుల అంశంపై అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఆమెకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ గాజర్ల రమేష్ పురస్కారాలు అందజేశారు. పూజశ్రీ విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె అక్టోబర్ 30న ఢిల్లీలో నిర్వహించే జాతీయ సదస్సులో పాల్గొననుంది.
తెలంగాణ
జాతీయ పోటీలకు పూజశ్రీ ఎంపిక


