హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్ధవీడు చెంచు కాలనీలో విషాదం

ప్రకాశం: అర్ధవీడు మండలం బొమ్మిలింగం చెంచు కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రసవం కోసం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన అంకాలమ్మ అనే మహిళ మగబిడ్డకు జన్మనివ్వగా, పుట్టిన వెంటనే శిశువు మృతి చెందాడు. అనంతరం అంకాలమ్మ ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించగా, సుమారు 23 రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందింది.