హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

SKLM: సంతబొమ్మాళి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి పనుల్లో ఉన్న గాయశ్రీ బికారి(55) వడదెబ్బతో కుప్పకూలారు. కొండ వద్ద పనులకు వెళ్లిన ఆయన స్పృహ కోల్పోయారు. కోటబొమ్మాళి ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం తెలిపారు. మృతుడికి భార్య సావిత్రి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.