KKD: తుని పట్టణ సుందరీకరణ పనులకు MLA యనమల దివ్య మంగళవారం శంకుస్థాపన చేశారు. HAM ప్రాజెక్టు కింద దాదాపు రూ.21 కోట్ల నిధులు సాధించడంతో టెండర్ల ప్రక్రియ పూర్తై వర్క్ ఆర్డర్లు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా 10 పార్కులు, 70 రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. ప్రజల అవసరాలు గుర్తించి పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తుని అభివృద్ధికి రూ.21 కోట్లు: MLA దివ్య


