హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు తైక్వాండో, వుషూ పోటీలు

శ్రీకాకుళం జిల్లాస్థాయి పాఠశాల క్రీడాపోటీల జట్ల ఎంపికల్లో భాగంగా బుధవారం కోడిరామ్మూర్తి మైదానంలో బాలబాలికలకు అండర్-14, 17, 19 విభాగాల్లో తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ జగదీష్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం శాంతినగర్‌లోని ఈతకొలను సమీపంలో అండర్-14, 17, 19 విభాగాల్లో వుషూ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు.