హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరం కొండపై వివాదం.. కలెక్టర్‌కు ఫిర్యాదు

KKD: అన్నవరం కొండపై టెండర్ దక్కించుకున్న తనను పక్క షాపు నిర్వాహకులు మోసం చేస్తున్నారని లక్ష్మీదుర్గ అనే మహిళ ఆరోపించారు. EO న్యాయం చేయకపోవడంతో కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చినట్లు మంగళవారం కాకినాడలో మీడియాకు తెలిపారు. పడమటి రాజగోపురం వద్ద L9 షాపు పొందిన తనపై పక్క దుకాణదారులు దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు.