హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి

NLG: చిట్యాల నుంచి యాదాద్రి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. 44 కి.మీ. మేర భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వేగంగా వచ్చే వాహనాలకు గుంతలు ముందుగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.