హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

JGL: గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పుష్కరాలపై సమీక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున మౌలిక వసతులు, భద్రతా చర్యలు, అభివృద్ధి పనులను ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని సూచించారు.