హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకి అంతరాయం

E.G: రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు APEPDCL ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఫోర్ట్ గేట్, బీఆర్కే ఫీడర్, కళానికేతన్ లైన్ల మరమ్మతులు, నూతన లైన్ల ఏర్పాటు పనుల వల్ల కోటగుమ్మం, మెయిన్ రోడ్, పుష్కర్ ఘాట్, కొత్తపేట, సీతమ్మ వీధి, రంగ్రీజ్ పేట, పప్పుల వీధుల్లో సరఫరా ఉండదన్నారు.