హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌దే అసలైన ఓట్ చోరీ: బీజేపీ

JGL: బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ఖండించారు. మంగళవారం జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని 65 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీపై అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఓట్ చోరీ అంశాన్ని తెచ్చారు.