హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ పీఠంపై పెరుగుతున్న ఉత్కంట

కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం కూటమి పార్టీల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. నియోజకవర్గ కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో మున్సిపల్ పీఠం కోసం భాగస్వామ్య పక్షాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. జనసేన నుంచి ఏడుగురు, టీడీపీ, బీజేపీ నుంచి ఇద్దరు చొప్పున ఆశావహులు ఉన్నట్లు సమాచారం. ఛైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయిస్తే పోటీ మరింత పెరగనుంది.