పల్నాడు జిల్లాలో జలజీవన్ మిషన్-1.0 పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కృతిక శుక్ల మంగళవారం ఆదేశించారు. జిల్లాలో రూ. 240.34 కోట్లతో మంజూరైన 604 పనుల్లో 368 పూర్తి కాగా, 231 పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ అందించాలని, పైప్‌లైన్ పనుల తర్వాత రహదారులను పునరుద్ధరించాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి'


