హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో ఎల్‌‌వో‌సీల అందజేత..!

NTR: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి రెండు ఎల్‌‌వో‌సీలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పత్రాలు అందజేశారు. వించిపేటకు చెందిన సయ్యద్ సలీంకు రూ. 4.32 లక్షలు, కేఎల్‌ రావునగర్‌కు చెందిన 10 ఏళ్ల గోపాలకృష్ణ ప్రతిభకు రూ. 2.40 లక్షల ఎల్‌‌వో‌సీలు అందించారు.