NTR: విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నేడు ముఖ్యమంత్రి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. CP రాజశేఖర బాబు స్టేడియం, పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలను మంగళవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మొత్తం 1,076 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో భారీ పోలీసు బందోబస్తు..!


