హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐఎంఏ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

JGL: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జగిత్యాల శాఖ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాఖ అధ్యక్షుడిగా డా.శశికాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా డా.చింత రమేష్, కోశాధికారిగా డా.వాసాల శ్రీధర్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఐఎంఏ జగిత్యాల శాఖను మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని అన్నారు .