హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేతన్నలకు ఊరట.. రూ.141.48 కోట్ల నిధులు

SRCL: ఇందిరా మహిళాశక్తి చీరల పథకం 2025-26కు రూ.92.54 కోట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ శాఖలకు యూనిఫాం, బెడ్డింగ్ మెటీరియల్ సరఫరా కోసం మరో రూ.48.94 కోట్లు మంజూరయ్యాయి. మొత్తంగా రూ.141.48 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు.