హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరేసుకొని పోస్ట్ ఆఫీస్ ఉద్యోగిని ఆత్మహత్య

JN: జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో పోస్ట్ ఉమెన్ అంకిత మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. తొర్రూర్ పట్టణంలో నివాసం ఉంటూ కొడకండ్లలో పోస్ట్ ఉమెన్‌గా పనిచేస్తున్న అంకిత, తొర్రూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.