WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను తహశీల్దార్ కృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. భోజన నాణ్యత, వసతులు, విద్యాబోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన తహసీల్దార్


