హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్‌స్టేషన్‌లో మొబైల్ చోరీ.. నిందితుడి అరెస్ట్

HNK: జిల్లా బస్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని మొబైల్ ఫోన్ చోరీ చేసిన అరవింద్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఉప్పల్, నల్గొండ-2 టౌన్, చేవెళ్ల, ఆర్పీఎస్ వరంగల్, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లలో గతంలో ఆరు కేసులు ఉన్నట్లు తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.