BPT: గాంధీ జయంతి సందర్భంగా చీరాల పురపాలక సంఘం పరిధిలో మాంసాహార విక్రయాలను నిషేధిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం నాడు మాంసం, చికెన్ స్టాల్స్, చేపల వ్యాపారులు షాపులను మూసివేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మాంసాహార విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ న్నారు.
ఆంధ్రప్రదేశ్
'మాంసం విక్రయాలు నిషేధం'


