హైదరాబాద్: 28°C
క్రీడలు

క్వార్టర్స్‌లో తెలుగు కుర్రాడు ధీరజ్

ఆర్చరీ రికర్వ్‌లో తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర సహా ముగ్గురు భారతీయులు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో చెంగ్ సియాంగ్ హూ (చైనీస్ తైపీ)పై ధీరజ్ 6-2తో విజయం సాధించాడు. మరో ప్రిక్వార్టర్స్‌లో కిమ్ జి దియోక్ (దక్షిణ కొరియా)కు నీరజ్ చౌహాన్ 6-4తో షాకిచ్చాడు. మహిళల ప్రిక్వార్టర్స్‌లో కుంకుమ్ 6-0తో సైమా (బంగ్లాదేశ్)ను చిత్తు చేసింది.