హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై గ్రామసభ

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు చర్లపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మార్వో సి. నర్సింగరావు, ఆర్‌ఐ హర్షవర్ధన్ రెడ్డి, జీపీఓ స్వరూప పాల్గొని ఎల్1, ఎల్2 లబ్ధిదారుల జాబితాలపై స్థానికులతో చర్చించారు. అక్రమాలకు తావులేకుండా ఇళ్లను కేటాయిస్తామన్నారు.