హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ కాలేజీకి జప్తు నోటీసు

సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి జీపీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులపై అధికారులు చర్యలు చేపట్టారు. సురభి మెడికల్ కాలేజీకి రూ.49 లక్షలు, ఆర్చీ ఫార్మాకు రూ.16 లక్షలు, SBI భవనానికి రూ.1 లక్ష బకాయి ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. సురభి మెడికల్ కాలేజీకి ఇప్పటికే రెండు డిమాండ్ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మూడు రోజుల గడువుతో జప్తు నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు.