హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూగర్భ జలాల పరిరక్షణే లక్ష్యం: కలెక్టర్ రాజర్షిషా

ADB: ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో మంగళవారం మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులతో కలెక్టర్ రాజర్షిషా సమీక్ష నిర్వహించారు. వాటర్ ప్లాంట్లలో నీటి వృధాను అరికట్టేలా ప్రతి బోర్వెల్ చుట్టూ రీచార్జ్ స్ట్రక్చర్స్ లేదా సోక్‌పిట్స్ విధిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అనుమతులు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు.