హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమ్స్‌లో సర్జరీ.. నిరీక్షణ తప్పదు..!

HYD: నిమ్స్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకోవాలంటే కొన్ని నెలల సమయం పడుతోంది. బెడ్ల కొరత, రోగుల రద్దీ వల్ల సర్జరీలకు దాదాపు 4 నుంచి 6 నెలలు పడుతోంది. సామర్థ్యానికి మించి రోగులు వస్తుండటంతో అడ్మిషన్లు, డిశ్చార్జీలు నరకంగా మారాయి. ఎమర్జెన్సీ మినహా మిగిలిన సర్జరీలకు నిరీక్షణ తప్పడం లేదు. పేషెంట్ల సంఖ్యకు తగ్గట్లు ఆపరేషన్ థియేటర్లు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.