హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు చటాలపై అవగాహన

NRML: నిర్మల్ మండలం చిట్యాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ చట్టాలు, వృద్ధుల హక్కులపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రవీందర్ రైతులకు పలు విషయాలు వివరించారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, గ్రామస్థులు పాల్గొన్నారు.