హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం దిష్టిబొమ్మ దహనం

GDWL: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర బీజేపీ పిలుపుతో గద్వాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందువులను బలహీనులుగా చిత్రీకరిస్తూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడటం సరికాదని బీజేవైఎం నేతలు అన్నారు. సీఎం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు.