NLG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తెలిపారు. మేళ్లదుప్పలపల్లి, తొరగల్, చిన్నమాదారం గ్రామాల్లో పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారని చెప్పారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
నల్గొండకు రేపు బీజేపీ చీఫ్


