హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోగన్నమఠం ZPH స్కూల్‌లో SMC ఎన్నికలపై వివాదం

కోనసీమ: గోగన్నమఠం జెడ్పీహెచ్ స్కూల్‌లో జరిగిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. 94 మంది ఓటర్లకు గాను 86 మంది హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు రెండు వర్గాలు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు నగదు పంపిణీ చేశాయని ఒక వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో 36 మంది ఎన్నికలను బహిష్కరించగా, 50 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.